Services
రత్నాలు:
రత్నాలను ప్రపంచంలో అన్ని మతాలవారు అన్ని దేశాలవారు ఎంతోమంది ధరిస్తుంటారు. దీనికి కారణం ధరించిన రత్నం ప్రభావం వలన వారికి మేలు కలుగుతుందని, లాభం చేకూరుతుందని. కాని ఈ రోజు మార్కెట్లో చాలామంది రత్నాలని చెప్పి చిన్న విజిటింగ్ కార్డ్ సైజు ల్యాబ్ సర్టిఫికేట్ ఇచ్చి రంగురాళ్ళను అమ్మేస్తున్నారు. వీటిని కొని ధరించి చాలామంది మోసపోతున్నారు మరియు ప్రభావం లేదని భావిస్తున్నారు.
మా వద్ద ప్రపంచవ్యాప్తంగా సేకరించిన అత్యుత్తమ అంతర్జాతీయ నాణ్యత కలిగిన విలువైన రత్నాలు లభించును.
మావద్ద కొన్న రత్నాన్ని బంగారం, వెండి మరియు పంచలోహాలలో ఉంగరంగా గాని లాకెట్ గా గాని తయారుచేయించి మీ జాతకమునకు సరిపడు పూజలు చేయించి ఏ ఊరు అయినా డోర్ డెలివరీ చేయబడును.
ల్యాబ్ సర్టిఫికేట్:
మా ల్యాబ్ సర్టిఫికేట్ A4 సైజులో ఉంటుంది. అంతేగాని మీకు మార్కెట్లో లభించే విజిటింగ్ కార్డ్ సైజు కాదు. మా రత్నాలన్నీ రాజస్థాన్ జైపూర్ వారి ICGTL (International Certified Gem Testing Laboratory) ద్వారా పరీక్షించబడతాయి. ఆ సర్టిఫికేట్‌పై ఉన్న నంబర్‌ను మీరు గూగుల్‌లో టైప్ చేయడం ద్వారా లేదా దానిపై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా మీ రత్నానికి సంబంధించిన పూర్తి వివరాలను మొబైల్‌లోనే తెలుసుకోవచ్చు.
బంగారం:
మా వద్ద నిపుణులైన ఆంధ్ర, బెంగాలి స్వర్ణకారుల ద్వారా మీరు కోరిన మోడల్స్ అన్ని రకాల బంగారు ఆభరణాలను చాలా తక్కువ సమయంలోనే తయారుచేసి ఇస్తాము. మేము మీకు ప్రభుత్వ గుర్తింపు పొందిన హాల్ మార్క్ (Hallmark) సర్టిఫికేట్‌ను అందిస్తాము. ఇందులో మీ పేరు, మొబైల్ నంబర్ మరియు మీ ఆభరణం యొక్క ఫోటోతో కూడిన ధృవీకరణ పత్రం ఉంటుంది. అంతేకాకుండా బంగారం క్వాలిటీ కూడా 916 కంటే కూడా ఎక్కువ క్వాలిటీ ఉంటుంది.
ధృవీకరణ పత్రం వలన మీకు కలుగు లాభాలు:
- ఈ హాల్ మార్క్ ఫోటోతో కూడిన సర్టిఫికేట్ ఉండటం వలన మీ బంగారు నగలకు పూర్తీ గుర్తింపు ఉంటుంది.
- భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఋణం పొందాలంటే ఏ బ్యాంక్ అయినా పెద్దమొత్తంలో ఋణం ఇస్తారు.
వెండి:
మేము అన్ని రకాల వెండి గిఫ్ట్ ఐటమ్స్ సరఫరా చేస్తాము.
జ్యోతిష్యం (ASTROLOGY):
జాతకం గురించి తెలుసుకోండి: మీ భవిష్యత్తును బంగారుబాటగా చేసుకొండి.
మనవ జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ భూమి మీద నివసించే (పుట్టిన) ప్రతి జీవికి జతకచక్రం వర్తిస్తుంది. కావున మనం ఒక పని చేసేటప్పుడు మంచి సమయం చూసుకోవడం మంచిది అని పెద్దల అభిప్రాయం. పెద్దలమాట చద్దిమూట అన్నారు. అందుకే పెద్దలు మొదలుపెట్టిన మాటనే మనం అనుకరించాల్సి ఉంటుంది. మన భవిష్యత్ కు మంచిది కూడా.
కావున మన జాతకం అనుసరించే పిల్లలు పుట్టుట, వారి చదువు, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, పెళ్లి, పిల్లలు, ఆరోగ్యం, కలహాలు వగైరా ప్రతీ సూక్షమైన సమాచారంను తెలుసుకోవాలి అంటే సరైన పుట్టిన తేదీ, సమయం, ప్రదేశం కావాలి. కావున ఆ సమయం బట్టి ఏర్పడే చక్రం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని శాస్త్రాలలో చెప్పబడింది. మనదరికి తెలుసు "గ్రహరూపే జనార్ధన" అంటే గ్రహదోషము సాక్షాత్తు ఆ భావంతుడికి కూడా వర్తిస్తుంది. మనం మానవమాత్రులమే.
ఈరోజుల్లో మనుషులు రకరకాలైన హడావిడిలో పడి తమ జీవితమును ఇబ్బందుల్లో పెట్టుకుంటున్నారు. దానిని గాడిలో పెట్టుకొనుటకు ఈ జాతక ఫలితములు ఉపయోగపడతాయి, కావున జాతక పరిశీలన, వాటి ఫలితాలు మనల్ని గాడిలో పెట్టి అనగా ఎంతో కొంత చెడు జరగకపోయినా తటస్థ వైఖరిలో ఉండుటకు ఉపయోగపడే సాధనం ఈ జాతక వ్యవస్థ.
అలాగే గ్రామ, రాష్ట్ర, దేశ మరియు విదేశ పరిస్థితులను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయటానికి ఈ జాతకచక్రం ఉపయోగపడుతుంది.
జాతకం బట్టి ముఖ్యంగా మన పుట్టుక నుంచి తల్లిదండ్రులతో సంబంధాలు లాంటి సూక్షమైన విషయాలను, మరియు సమాజంలో మన సత్సంబంధాలు కూడా మనం కూలంకషంగా చెప్పడంలో ఉపయోగపడేదే జాతకవ్యవస్థ.
ఇది ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాగ ఉపయోగపడి మనిషి జీవితమును అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది.
అసలు మనం జాతకములు గురించి ఆలోచన చేసేదే మనకు జరిగే దారుణమైన నష్టాలను స్వల్ప నష్టాలుగా మార్చుటకు ఏర్పాటుచేసిన వ్యవస్థ. జాతకము అనగా భగవంతుడు వ్రాసిన రాతను మనం తెలుసుకొనుట. అందువలన ఎంతో ప్రావీణ్యం ఉన్న జ్యోతిష్యులను మనం ఎంచుకోవలసి ఉన్నది.
కావున జాతకము గురించి ఆందోళన చెందక సంతోషంగా జీవితమును గడపడానికి ఈ జాతకఫలితాలను మనకు అనుగుణంగా దోషనివారణ ద్వారా జీవితమును సుఖమయంగా మలచుకోవడానికి ఉపయోగపడేదే ఈ జాతక వ్యవస్థ.
మీకు ఆన్ లైన్ లో మీ జాతకమును క్షుణ్ణంగా పరిశీలించి గోదావరి జిల్లాల్లో గల ప్రముఖ పంచాంగకర్తలు, జ్యోతిష్యపండితులచే మీ గ్రహాలకు అనుకూలమైన రత్నాలు, పూజలు, జపాలు, హోమాలు సూచించెదరు. తద్వారా మీ భవిష్యత్తుకు బంగారుబాట వేసుకోనవచ్చును.

